ఐసీయూలో లతా మంగేష్కర్… కోవిడ్-19 పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. సెలెబ్రిటీలు వరుసగా కోవిడ్-19 బారిన పడుతున్నారు. రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ రిజల్ట్స్ సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా భారత రత్న అవార్డు గ్రహీత, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నారు. ఆమెకు తేలికపాటి లక్షణాలు ఉన్నట్టు సమాచారం.

Read Also : రేణూ దేశాయ్ ఇంట్లో కరోనా కలకలం

లతా మంగేష్కర్ మేనకోడలు రచన ఈ విషయాన్ని వెల్లడించారు. 2019 నవంబర్ లో లతా మంగేష్కర్ వైరల్ చెస్ట్ కంజెస్టిన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం అనే కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె వయసు, ఆరోగ్యం దృష్ట్యా వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆమె కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని లతా మంగేష్కర్ అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Related Articles

Latest Articles