సంచలన విషయాలు బయటపెట్టిన పాక్‌ టెర్రరిస్ట్‌..

సంచలన విషయాలు బయటపెట్టిన పాకిస్థాన్‌ టెర్రరిస్ట్‌ అలీ బాబర్‌.. ఉగ్రవాదులను భారత్‌పై ఎగదోసి దాడులు చేసే ప్రయత్నాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పాక్‌ యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తూ వారిని భారత్‌లోకి పంపుతోంది. జమ్మూకశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో పట్టుబడిన అలీ బాబర్‌ పాత్ర అనే పాక్‌ ఉగ్రవాది ఈ సంచలన విషయాలు వెల్లడించాడు. అతడికి లష్కరే తోయిబాతోపాటు పాకిస్థాన్‌ ఆర్మీ శిక్షణ ఇచ్చారని… అంతేకాదు బారాముల్లాలోని ఓ ప్రాంతానికి ఆయుధాలను చేరవేసేందుకు ఇరవై వేలు ఇచ్చారన్నాడు.

కాగా, ఉరి సెక్టార్‌లో సెప్టెంబర్‌ 28న ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా.. మరో పాక్‌ ఉగ్రవాదిని భారత సైన్యం సజీవంగా పట్టుకుంది. ఇలా భారత్‌లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా ఓ పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి. అయితే, పట్టుబడిన ఉగ్రవాది నుంచి కీలక సమాచారం రాబట్టింది భారత సైన్యం. పట్టుబడ్డ ఉగ్రవాదికి ముజఫరాబాద్‌లోని లష్కరే క్యాంపులో శిక్షణ ఇచ్చారని.. అతనితో సహా ఆరుగురు ఉగ్రవాదులు సెప్టెంబర్‌ 18న భారత్‌లోకి ప్రవేశించారని గుర్తించారు. ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో దాదాపు 70 మంది వరకు పాక్‌ ఉగ్రవాదులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వీరంతా నేరుగా దాడుల్లో పాల్గొనకుండా.. స్థానికంగా ఉన్న వారిని దాడుల్లో పాల్గొనేలా రెచ్చగొట్టే వ్యూహాలు అమలు చేస్తారని చెబుతున్నారు. అయితే, మాది పేద కుటుంబం. నాన్న లేడు. వస్త్ర పరిశ్రమలో పనిచేసేవాడిని. ఆ సమయంలో ఐఎస్‌ఐతో సంబంధాలున్న కుర్రాడితో పరిచయం ఏర్పడింది. డబ్బుకి ఆశపడి అతనితో పాటు లష్కరే తొయిబాలో చేరానని.. శిక్షణ సమయంలో వారు తనకు రూ.20 వేలు ఇచ్చారు. శిక్షణ పూర్తయ్యాక మరో రూ.30 వేలు ఇస్తామన్నారి తెలిపాడు. తర్వాత నన్ను పాకిస్థాన్‌ సైన్యం వద్దకు తీసుకెళ్లారు. వారు చెప్పినట్టు నేను, మరికొందరు భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించామని చెప్పుకొచ్చారు. దీంతో.. వీటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్న సైన్యం.. ఇలాంటి అక్రమ చొరబాటుదారులపై కన్నేసి ఉంచుతోంది.

-Advertisement-సంచలన విషయాలు బయటపెట్టిన పాక్‌ టెర్రరిస్ట్‌..

Related Articles

Latest Articles