బంగారు పతకం అందుకున్న మూషికం మృతి..

బంగారం పతకం అందుకున్న ఓ మూషిక రాజు కన్నుమూశారు.. అదేంటి.. ఎలుక ఏంటి? బంగారం పతకం అందుకోవడం ఏంటి..? అసలు ఇంట్లో ఎలుకలు ఉన్నాయంటేనే పట్టి చంపేస్తాం.. బోన్‌ పెట్టో.. ప్యాడ్‌ తోనూ వాటిని పట్టుకుని చంపేస్తుంటాం.. ఎందుకంటే.. ఎలుక రాజులు ఇళ్లలో చేసే పనులు అలాంటివి.. కానీ, ప్రత్యేక శిక్షణ పొందిన ఓ ఎలుక.. ఎంతో మంది ప్రాణాలను కాపాడింది.. కాంబోడియాలో మందుపాతరల అన్వేషణలో దిట్టగా పేరొందిన ఆ ఎలుక.. మందుపాతరల బారి నుంచి చాలా మందిని సేవ్‌ చేసింది.. ఆ ఎలుక సేవలకు ప్రతిష్ఠాత్మక బంగారు పతకాన్ని కూడా అందజేసింది ఓ సంస్థ.. గత ఏడాదే రిటైర్మంట్‌ కూడా పొందిన ఆ ఎలుక ఇప్పుడు కన్నుమూసింది.

Read Also: బూస్టర్‌డోసు నుంచి రక్షణ ఎంత..?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్రికన్‌ సంతతికి చెందిన ‘మగావా’ అనే ఎలుక మృతిచెందింది.. మందుపాతరలను గుర్తించడం, వాటిని వెలికితీయడంలో.. ఎంతో కీలకంగా పనిచేసింది.. పేలుడుకు అవకాశం లేకుండా ముందుగానే ఎన్నో మందుపాతరలను గుర్తించింది.. బెల్జియం కేంద్రంగా పనిచేసే ‘అపొపో’ అనే స్వచ్ఛంద సంస్థ.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.. అపొపో.. మందుపాతరల వంటివి వాసన ద్వారా కనుగొనేలా ఎలుకలు, కుక్కలకు శిక్షణ ఇచ్చే సంస్థ.. 2013లో టాంజానియాలో పుట్టిన ‘మగావా’ను శిక్షణ తర్వాత అనంతరం 2016లో కాంబోడియాకు పంపారు. అప్పటి నుంచి వందకు పైగా మందుపాతరలను గుర్తించింది మగావా.. కాగా, ఈ దేశంలో దాదాపు మూడు దశాబ్దాలపాటు సాగిన అంతర్యుద్ధం 1998లో ముగిసింది.. యుద్ధ సమయంలో భూమి లోపల పాతిపెట్టిన మందుపాతరలు పెద్ద సవాల్‌గా మారాయి.. అవి పేలి ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.. కానీ, ఐదేళ్ల పాటు సేవలు అందించిన మగావా.. ఎన్నో మందుపాతరలను, బాంబులను గుర్తించి.. వాటిని నిర్వీర్యం చేయడంలో అద్భుతమైన సేవలను అందించింది.. ఇప్పటికే ఈ ఎలుకకు రిటైర్మెంట్‌ కూడా ఇచ్చారు.. మరోవైపు.. మగావా అందించిన సేవలకు గుర్తించిన బ్రిటన్‌కు చెందిన ‘పీపుల్స్‌ డిస్పెన్సరీ ఫర్‌ సిక్‌ అనిమల్స్‌’ అనే వెటర్నరీ ఛారిటీ సంస్థ… 2020లో మగావాకు బంగారు పతకాన్ని కూడా అందజేసింది.. అల్ప జీవే అనుకున్నా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఈ మూషిక రాజు.. చివరకు ప్రాణాలు వదిలాడు.

Related Articles

Latest Articles