పవన్ కళ్యాణ్ పై లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ !

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మరియు పోసాని కృష్ణ మురళి వివాదంపై తెలుగు, సంస్కృతి అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి స్పందించారు. పోసాని మురళి భార్యకు జరిగిన అవమానం చూశాక మాట్లాడకుండా వుండటం మానవత్వం కాదని పవన్‌ కళ్యాణ్‌ పై మండిపడ్డారు లక్ష్మీ పార్వతి. మహిళల ఆత్మ గౌరవాన్ని కించ పరిచే స్థాయికి తెలుగుదేశాన్ని దిగజార్చిన హీనుడు చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. అతని రాజకీయాలకు వారసత్వాన్ని లోకేష్, పవన్ సాగిస్తున్నారని…. పవన్ కళ్యాణ్ విలువలకు తిలోదకాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ బయటకే రాని పోసాని భార్యను కూడా అవమానించడం అంటే ఏ స్థితికి పవన్ కల్యాణ్ దిగజారాడో అర్థం అవుతుందని నిప్పులు చెరిగారు లక్ష్మీ పార్వతి.

-Advertisement-పవన్ కళ్యాణ్ పై లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ !

Related Articles

Latest Articles