సంస్కృతం చేర్చడం వల్ల తెలుగుకు వచ్చే నష్టమేమీ లేదు : లక్ష్మీపార్వతి

తెలుగు అకాడమీని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఎంతో ఆశగా ఉంది. కానీ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఐదేళ్లలో తెలుగు అకాడమీని నిర్వీర్యం చేసిపడేసింది. తెలుగు అనే పేరు లేకుండా చేసేశారు. 30 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు అని తెలుగు అకాడమీ సొసైటీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తెలుగు భాషాభిమానులు ఆలోచన చేసుంటే ఇలాంటి దుర్ధశ పట్టేది కాదు అని తెలిపారు.

ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు -నేడు కింద విద్యాభ్యాసానికి పెద్ద పీటవేశారు. తెలుగు అకాడమీ పై సీఎం జగన్ నాకు పూర్తి స్వాతంత్య్రం ఇచ్చారు. సంస్కృతం చేర్చడం వల్ల తెలుగుకు వచ్చే నష్టమేమీ లేదు. తెలుగు భాషకు సంస్కృతం అనేది ఒక ఉపలబ్ధి మాత్రమే. తెలుగు భాషను దెబ్బతీసేంత స్థాయి సంస్కృతానికి లేదు. తెలుగు అకాడమీ బైలా కొంచెం కూడా మారలేదు. నేను కానీ, నాతర్వాత వచ్చేవారు కానీ తెలుగుఅకాడమీ వైభవాన్ని ఎవరూ దెబ్బతియ్యరు. తెలుగు అకాడమీ ద్వారా తొలిసారిగా ఇంటర్మీడియట్ పుస్తకాల ముద్రణకు అనుమతిచ్చారు. రాబోయే వారం రోజుల్లో సీఎం చేతుల మీదుగా పుస్తకాలను ఆవిష్కరింపజేస్తాం అని పేర్కొన్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-