పాక్ నెత్తిన మ‌రో పిడుగు: కాలుష్య న‌గ‌రాల్లో లాహోర్ ప్ర‌ధ‌మ‌స్థానం…

మ‌నిషి ప‌రిపూర్ణ ఆరోగ్య‌వంతుడిగా జీవించాలి అంటే స్వ‌చ్చ‌మైన గాలి కావాలి.  మహాన‌గ‌రాల్లో పెరుగుతున్న జ‌న‌సాంధ్ర‌తా, వాహ‌నాల కాలుష్యం కార‌ణంగా గాలిలో స్వ‌చ్చ‌తా ప్ర‌మాణాలు క్ర‌మంగా త‌గ్గిపోతున్న‌ది.  ప్ర‌పంచంలో కాలుష్యం పెరిగిపోతుండ‌టంతో దానిని తగ్గించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి దేశాలు.  అభివృద్ది చెందిన దేశాల నుంచే అధిక మొత్తంలో కాలుష్యం వ‌చ్చిచేరుతున్న‌ది.  చాలా దేశాలు కాలుష్యం గురించి ప‌ట్టించుకోవ‌డంలేదు.  

Read: వైర‌ల్‌: బిచ్చ‌గాడి అంతిమ‌యాత్ర‌కు భారీగా హాజ‌రైన జ‌నం…ఇదే కార‌ణం…

ప్ర‌మాణాలు పాటించ‌కుంటే ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ముప్పు ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఇక‌, అత్యంత స్వ‌చ్చ‌మైన గాలిని క‌లిగియున్న దేశాలు యూర‌ప్‌లో అధికంగా ఉన్నాయి.  ఇక‌పోతే అత్యంత కాలుష్య‌పూరిత‌మైన న‌గ‌రాల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉన్న సంగ‌తి తెలిసిందే.  ఢిల్లీ న‌గ‌రంలో కాలుష్యం వాల్యూ ఇండెక్స్ 330 ఉన్న సంగ‌తి తెలిసిందే.  అయితే, ప్ర‌పంచంలోనే అత్యం కాలుష్య‌పూరిత‌మైన న‌గ‌రం జాబితాల‌తో పాక్ లోని లాహోర్ న‌గరం ప్ర‌థమ‌స్థానంలో ఉన్న‌ది.  ఈ న‌గ‌రంలో గాలి ప్ర‌మాణ నాణ్య‌త 348 గా ఉన్న‌ట్టు అంత‌ర్జాతీయ సంస్థ ఐక్యూఎయిర్ తెలియ‌జేసింది.  పొగ‌మంచు, వాహ‌నాల నుంచి, క‌ర్మాగారాల నుంచి వెలువ‌డుతున్న ప్ర‌మాద‌క‌ర‌మైన పొగ వ‌ల‌న గాలిలో కాలుష్యం మ‌రింత‌గా పెరిగిపోతున్న‌ద‌ని ఆ సంస్థ హెచ్చ‌రించింది.  ఇక‌, ఈ కాలుష్యం కార‌ణంగా బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నామ‌ని, శ్వాస‌సంబంధ‌మైన స‌మ‌స్య‌లు పెరిగిపోతున్నాయ‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు.  

Related Articles

Latest Articles