ఇవాళ కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో చేరనున్న ఎల్‌. రమణ

టీటీడీపీని వీడిన ఎల్ .రమణ .. ఇవాళ టీఆరెస్‌ తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన… తన అనుచరులతో కలిసి.. గులాబీ కండువా కప్పుకుంటారు. చేరికల కోసం తెలంగాణ భవన్‌లో నేడు ప్రత్యేక కార్యక్రమం జరగబోతోంది. కొద్ది రోజుల క్రితం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రమణ పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో బలమైన బీసీ నేత కోసం .. టిఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

హైకమాండ్ ఆదేశాలతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు… ఎల్ .రమణతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ను కలసిన ఎల్.రమణ టిఆర్ఎస్ లో చేరేందుకు అంగీకరించారు. టీఆరెస్‌లో ఆయనకు మంచి గుర్తింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ సాగుతోంది. మరోవైపు హుజురాబాద్ ఉపఎన్నిక జరగనున్న సమయంలో… ఎల్‌రమణ పార్టీలో చేరడం కలిసొస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. జిల్లాలో రమణ సామాజికవర్గం ఎక్కువగా ఉండడంతో ఓటు బ్యాంకు గులాబీ గూటిదేనని గట్టిగా విశ్వసిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-