‘స్కైలాబ్’ ఓటీటీ అలర్ట్…

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్, హీరో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణన్ ప్రద పాత్రల్లో తెరకెక్కిన చిత్రం స్కైలాబ్. కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. పిరియాడికల్ డ్రామాగా డిసెంబర్ 4న విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకొంది. ఇక ఈ సినిమా ఎప్పుడో ఓటిటీ లో రావాల్సి ఉండగా కొన్ని కర్నాల్ వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటీ అలెర్ట్ ని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఓటిటీ లోకి అడుగుపెట్టనుంది. భారీ ధరకు స్కైలాబ్ సినిమా ను సోని లివ్ ఓటీటీ వారు తెలుగు లో స్ట్రీమింగ్ చేసేందుకు గాను హక్కులు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని సోనీలివ్ తెలుపుతూ జనవరి 14 న స్కైలాబ్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాకు నిత్యామీనన్ నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. మరి థియేటరర్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటిటీ లో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

Related Articles

Latest Articles