వైఎస్‌ కాంగ్రెస్‌ మనిషి.. నేను ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తున్నా..

వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా ఇవాళ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు విజయమ్మ. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ సమావేశానికి వైఎస్‌ఆర్‌తో పని చేసిన వారికి, సన్నిహితులకు ఆహ్వానాలు పంపారు.. ఇక, వైఎస్‌ఆర్ సన్నిహితుడి, ఆత్మగా పేరున్న మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు కూడా ఆహ్వానం వెళ్లింది.. గాంధీ భవన్‌లో వైఎస్‌ఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆత్మీయ సమ్మేళనానికి నాకు ఆహ్వానం అందింది.. నేను వెళ్తున్నానని వెల్లడించారు.. ఆత్మీయ సమ్మేళనం ఎందుకు ఏర్పాటు చేశారు అనేది.. విజయమ్మ చెప్పాలన్న ఆయన.. వైఎస్ కాంగ్రెస్‌ మనిషి.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప వ్యక్తి అంటూ.. తన స్నేహితుడి గురించి గుర్తుచేసుకున్నారు.. కాగా, గాంధీ భవన్‌కు వచ్చిన కేవీపీ… పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్యతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా.. ఇవాళ సాయంత్రం విజయమ్మ నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంపై చర్చించారు.

Related Articles

Latest Articles

-Advertisement-