ఇక బూస్టర్ డోస్.. అక్కడ నమోదు ప్రక్రియ ప్రారంభం..

కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌… ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. కొన్ని సింగిల్‌ డోస్ అయితే, మెజార్టీ వ్యాక్సిన్లు మాత్రం డబుల్ డోస్‌వి.. మరోవైపు.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగవంతంగా సాగుతోంది… అయితే, ఫస్ట్‌, సెకండ్‌ డోస్‌ తీసుకున్నవారిలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి.. కానీ, వారిపై ప్రభావం అంతగా చూపలేకపోతోంది.. ఇదే సమయంలో, బూస్టర్‌ డోస్‌ బెటర్‌ అంటున్నారు వైద్య నిపుణులు.. దీంతో.. ఆ దిశగా పలు దేశాలు అడుగులు వేస్తున్నాయి.. కువైట్‌ సర్కార్ కూడా బూస్టర్ డోస్ నమోదు ప్రక్రియను ప్రారంభించింది.. మొదటగా 60 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. దీనికి సంబంధించిన నమోదు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్లా అల్ సనద్ ప్రకటించారు.. అయితే, రెండో డోసు తీసుకున్న వారు ఆరు నెలల తర్వాత ఈ బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి.. బూస్టర్‌ డోసు తీసుకున్న తర్వాత ఎలాంటి రక్షణ ఉంటుందో చూడాలి.

-Advertisement-ఇక బూస్టర్ డోస్.. అక్కడ నమోదు ప్రక్రియ ప్రారంభం..

Related Articles

Latest Articles