కూకట్ పల్లిలో రెచ్చిపోయిన యూత్.. రేవ్ పార్టీ భగ్నం

హైదరాబాద్‌ నడిబొడ్డున యువత రెచ్చిపోయారు. మందు, విందు, యువతులతో కలిసి చిందేశారు. రచ్చరంబోలా చేశారు. దీంతో సమాచారం అందుకున్న స్సెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని ఇంటిపై దాడులు చేసిన ఎస్వోటీ పోలీసులు షాకయ్యారు.

కూకట్ పల్లిలో రెచ్చిపోయిన యూత్.. రేవ్ పార్టీ భగ్నం

రేవ్ పార్టీ పేరుతో యువత చిందులేశారు. ఈ సందర్భందా 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. పెద్ద మొత్తంలో మద్యం బాటిల్, కండోమ్ ప్యాకెట్ స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. యువకులంతా కలిసి ప్రతి వీకెండ్లో పార్టీ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు వారి వెనుక వున్నది ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన వారంతా కూడా హోమో సెక్స్ వల్ గా అనుమానిస్తున్నారు పోలీసులు.

గత రాత్రి ఓ ఇంట్లో హుక్కా పార్టీ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందింది. పార్టీకి హాజరయ్యేందుకు అనుమతి కోసం 300 రూపాయలు వసూలు చేశారు నిర్వాహకులు ఇమ్రాన్, దయాల్. పార్టీకి 42 మంది యువకులు హాజరయ్యారు. అందులో కొందరు స్వలింగ సంపర్కులు. అధిక శబ్దంతో మ్యూజిక్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్టానికులు. నిర్వహకులతో పాటు పార్టీకి వచ్చిన యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 2 హుక్కా పాట్లు,3 హుక్కా ఫ్లేవర్లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుల పై నిషేధిత హుక్కా వినియోగం పై కేసు నమోదు చేశారు. మిగిలిన యువకుల పై పెట్టి కేసులు నమోదు చేశారు.

Related Articles

Latest Articles