ఈటల రాజేందర్‌ ది ఆత్మవంచన : కేటీఆర్‌

మాజీ మంత్రి ఈటలపై తొలిసారిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈటెల రాజేందర్ కు టీఆరెస్ ఎంత ఇచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలని.. ఈటెలకు టీఆరెస్ లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని నిలదీశారు. మంత్రిగా ఉండి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టారని…ఈటెల రాజేందర్ తప్పు చేయకుండానే ఒప్పుకున్నారా? అని ప్రశ్నించారు కేటీఆర్. కేంద్రం.. తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇచ్చిందని…టీఆరెస్ అభివృద్ధిని.. బీజేపీ ఖాతాలో ఈటెల ఎలా వేసుకుంటారు? అని ఫైర్‌ అయ్యారు.

read also : ప్రశాంత్‌ కిషోర్‌ వరుస భేటీల వెనుక అసలు రహస్యం ఇదేనా..!

ఈటెల రాజేందర్ పై సానుభూతి ఎందుకు..ఎలా వస్తుంది?ఈటెల పై అనామకుడు ఉత్తరం రాస్తే సీఎం చర్యలు తీసుకోలేదన్నారు. ఈటెల రాజేందర్ ఆత్మ వంచన చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల కిందట నుంచి కేసీఆర్ తో గ్యాప్ ఉంటే ఎందుకు మంత్రిగా కొనసాగారు?… ఐదేళ్ల నుంచి ఈటెల రాజేందర్ అడ్డంగా మాట్లాడినా మంత్రిగా కేసీఆర్ ఉంచారని తెలిపారు కేటీఆర్‌. ఈటెల రాజేందర్ చివరి వరకు పార్టీలో ఉండాలని తానే వ్యక్తిగతంగా ప్రయత్నం చేసానని తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-