నేడు పార్టీ నేతలతో కేటీఆర్ కీలక భేటీ…

ఈనెల 2 నుంచి టిఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంను ప్రారంభించింది. గ్రామ,వార్డు కమిటీల ఏర్పాటు మొదలైంది. ఇటు ఈ నెలలోనే జిల్లా కమిటీలతో పాటు అనుబంధ కమిటీల ఏర్పాటును పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన కమిటీల ఏర్పాటుపై ఇవాళ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. గ్రేటర్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కమిటీల ఏర్పాటుపై సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.టిఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి నలుగురు నేతలు హైదరాబాద్ పార్టీ బాధ్యతలు నిర్వహించారు. ఇందులో పద్మా రావు గౌడ్ తో పాటు మైనంపల్లి హన్మంత రావులు ఉన్నారు.ఇప్పడు టిఆర్ఎస్ జిల్లా ,నగర కమిటీలు ఏర్పాటు నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం దక్కుతుంది అన్న చర్చ జరుగుతోంది. అలాగే గ్రేటర్లో డివిజన్ ,బస్తీ కమిటీలు కూడా ఏర్పాటు కానున్నాయి. పార్టీ కమిటీల ఏర్పాటుపై ఇవాళ జరిగే సమావేశంలో గ్రేటర్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత … ఒక నిర్ణయం తీసుకునే ఆవకాశం ఉంది.

Related Articles

Latest Articles

-Advertisement-