బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్.. రాజీనామాకు సిద్ధమా !

తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇవాళ గద్వాల నియోజక వర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… గద్వాల నుంచి బండి సంజయ్ కు సవాల్ విసురుతున్నానని… చేతనైతే సవాల్ ను స్వీకరించాలని పేర్కొన్నారు. తాను చెప్పేది తప్పైతే… రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని… నీది తప్పైతే నీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తవా ? అంటూ సవాల్‌ విసిరారు మంత్రి కేటీఆర్‌.

తెలంగాణ రాష్ట్రం నుంచి 2 లక్షల 72 వేల కోట్లు పన్నుల రూపంలో కడితే… రాష్ట్రానికి ఇచ్చింది లక్ష 42 వేల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. మొత్తం మీ పైసలే ఐతే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు ? అని… పక్క రాష్ట్రాలు తెలంగాణలో కేసీఆర్ పాలనను చూసి అసూయపడుతున్నాయని తెలిపారు. పైసలు కేంద్రానివి, రాష్ట్రానివి సోకులు అంటు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు…. మోడీ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం 7 ఏళ్లలో ఉద్యోగ లక్ష 32వేల899 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని… బీజేపీ ఇస్తామన్న కోట్ల ఉద్యోగాలెక్కడపోయాయని నిప్పులు చెరిగారు కేటీఆర్.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-