ఇండియన్ సూపర్ హీరో ‘క్రిష్’… 4వ సారి!

బాలీవుడ్ లో అందగాళ్లకు కొదవేం లేదు. కానీ, హృతిక్ రోషన్ రేంజే వేరు! లుక్స్ పరంగానే కాకుండా హైట్, ఫిజిక్ తో కూడా ఆకట్టుకుంటాడు గ్రీక్ గాడ్! ఆపైన తన యాక్టింగ్ టాలెంట్ తో ఎలాంటి సినిమానైనా బాక్సాపీస్ వద్ద బలంగా నిలబెట్టగలడు! అయితే, ఇదంతా హృతిక్ ని, మిగతా స్టార్ హీరోలతో సమానం చేస్తుంది. కానీ, అతడ్ని బాలీవుడ్ లో అందరికంటే స్పెషల్ గా నిలబెట్టేది ‘క్రిష్’ ఫ్రాంఛైజ్!
బీ-టౌన్ లో ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ టాప్ ‘సూపర్ హీరో’ హృతిక్ మాత్రమే! ‘కోయిమిల్ గయా’, ‘క్రిష్’, ‘క్రిష్ 3’ లాంటి చిత్రాల్లో అతను చేసిన సాహస వీరుడి పాత్ర మరే ఇతర బాలీవుడ్ స్టార్ కి కూడా దక్కలేదు. అందుకే, డీసీ, మార్వెల్ కామిక్స్ లోని సూపర్ హీరోల్ని ఎంతో ఇష్టంగా చూసే ఇండియన్ కిడ్స్… ‘క్రిష్’ని కూడా అదే రేంజ్లో ఆదరిస్తుంటారు. కానీ, చాలా ఏళ్లుగా ‘క్రిష్ 4’ టాక్ వినిపిస్తోందే తప్ప… ఇంత వరకూ ఏదీ మెటీరియలైజ్ కాలేదు. కాకపోతే, లెటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ లో హృతిక్ షేర్ చేసిన ఓ చిన్న వీడియో మళ్లీ ‘క్రిష్ 4’ను చర్చలోకి తీసుకొచ్చింది…
‘క్రిష్’ సిరీస్ లో మొదటి సినిమా ‘కోయి మిల్ గయా’ 2006లో విడుదలైంది. 2021తో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. అదే విషయాన్ని తన ఫాలోయర్స్ తో ఓ ఇన్ స్టాగ్రామ్ వీడియో రూపంలో షేర్ చేసుకున్న హృతిక్, ‘’ద పాస్ట్ ఈజ్ డన్. లెట్స్ సీ వాట్ ద ఫ్యూచర్ బ్రింగ్స్… క్రిష్ 4’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అంటే, త్వరలో తన సూపర్ హీరో ఫ్రాంఛైజ్ లో 4వ చిత్రం తెరకెక్కబోతోందన్నమాట!
‘క్రిష్ 4’ గురించిన అధికారిక వివరాలేవీ ఇంకా తెలియకపోయినా హృతిక్ ఆ సీక్వెల్ కంటే ముందు ‘ఫైటర్’, ‘వార్ 2’ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. చూడాలి మరి, ఇండియన్ సూపర్ హీరో సూపర్ సీక్వెల్ ఎంత కాలానికి మన ముందుకు వస్తుందో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-