వర్చువల్‌గా భేటి అయినా కేఆర్‌ఎంబీ అధికారులు

కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ వర్చువల్‌గా సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, ఏపీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి వర్చువల్‌గా పాలర్గొన్నారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ర్టాల తాగు, సాగు అవసరాలకు సంబంధించిన నీటి విడుదల గురించి చర్చించారు. నీటి కేటాయింపులపై సరైన నిర్ణయం తీసుకోవాలని మురళీధర్‌ బోర్డునుకోరారు. గెజిట్‌ అమలు పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను ఆయన వివరించారు.

కాగా ఇప్పటికే నీటి కేటాయింపులపై పలుమార్లు బోర్డు చర్చించింది. కృష్ణానదీ యాజమాన్య వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ సర్కార్‌ ఇప్పటికే వాదిస్తుంది. ఈ పంచాయతీ బోర్డు వరకు వెళ్లింది. దీంతో బోర్డు పలుమార్లు సమావేశాలు నిర్వహించి రాజీ కుదుర్చే ప్రయత్నం చేసినప్పటికీ రెండు రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం మాత్రం రాలేదు. దీంతో బోర్డు త్రిసభ్య కమిటీని నియమించింది. ప్రస్తుతం నీటి విడుదల వాటి పై ఉన్న అభ్యంతరాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది.

Related Articles

Latest Articles