తెలంగాణ సర్కార్‌కు కేఆర్‌ఎంబీ లేఖ.. వెంటనే ఆపండి..!

కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. ఆ తర్వాత ఫిర్యాదులు, లేఖలు ఇలా ముందుకు సాగింది.. ఇప్పుడు.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు.. ఇప్పటికే కేఆర్‌ఎంబీకి.. ఏపీ నుంచి, తెలంగాణ నుంచి లేఖలు వెళ్లగా.. తెలంగాణ చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలని తెలంగాణ జెన్కోకు ఇప్పుడు కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నీటి విడుదల ఆపాలని పేర్కొంది.. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జల విద్యుత్ ప్రాజెక్టుల్లో.. నీటి విడుదల తక్షణం ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. విద్యుత్ ఉత్పత్తి నీరు.. ఇరిగేషన్ లేదా.. త్రాగునీటి ఉపయోగపడేలా ఉండాలని.. రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం ఉందని తన లేఖలో పేర్కొంది కేఆర్ఎంబీ.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-