ఏపీకి కూడా కేఆర్ఎంబీ లేఖ.. డీపీఆర్‌ ఇవ్వండి..!

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తారాస్థాయికి చేరి ఫిర్యాదుల వరకు వెళ్లింది.. జల విద్యుత్‌ ఉత్పత్తి విషయంలో తెలంగాణపై ఏపీ ఫిర్యాదు చేస్తే.. ఆర్డీఎస్‌ విషయంలో ఏపీపై తెలంగాణ ఫిర్యాదు చేసింది.. అయితే ఇవాళ రెండు రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు లేఖలు రాసింది.. ఇప్పటికే తెలంగాణ చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలని తెలంగాణ జెన్కోకు లేఖ రాసిన కేఆర్ఎంబీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జల విద్యుత్ ప్రాజెక్టుల్లో.. నీటి విడుదల తక్షణం ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. ఇక, తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు కూడా లేఖ రాసింది బోర్డు.. ఆర్డీఎస్ కుడి కాల్వ పనులపై డీపీఆర్ ఇవ్వాలని కోరింది.. అంతే కాదు.. డీపీఆర్ సమర్పించి ఆమోదం పొందేంత వరకు ఆర్డీఎస్ కుడి కాల్వ పనులు నిలిపేయాలని ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టం చేసింది కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-