నేడు కేఆర్ఎంబీ సమావేశం…

ఈరోజు ఉదయం11 గంటలకు కృష్ణానది యాజమాన్య బోర్డ్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ లు, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్లు, కేఆర్ఎంబీ అధికారులు పాల్గొననున్నారు. మొత్తం 13 అంశాల ఎజెండాగా బోర్డ్ సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాలకు కృష్ణ బేసిన్ లో నీటి కేటాయింపు, బోర్డుల పరిధి, బోర్డ్ తరలింపు ఇతర అంశాలపై చర్చించనున్నారు కేఆర్ఎంబీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనులు, పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ పనుల అంశాన్ని సమావేశంలో లెవనెత్తనున్నారు తెలంగాణ అధికారులు

అలాగే శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి పై ఏపీ ప్రభుత్వం వాదించే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు కేఆర్ఎంబీ , జీఆర్ఎంబీ సంయుక్త సమావేశం జరపనున్నాయి. ఈ సమావేశానికి కూడా హాజరుకానున్నారు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ పై చర్చించే అవకాశం ఉంది. మరియు రెండు బోర్డుల పరిధిపై ప్రత్యేకంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-