సల్మాన్ ఎఫెక్ట్ తో… అర్జున్ కపూర్ మాత్రమే ‘మగాడు’ అంటోన్న కేఆర్కే!

షారుఖ్ ఖాన్ ని షార్ట్ గా ఎస్ఆర్కే అంటుంటారు. అది మనందరికీ తెలుసు. కానీ, మీకు కేఆర్కే తెలుసా? తెలిసినా, తెలియకపోయినా ప్రస్తుతం కేఆర్కే బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాడు. మొదట సల్మాన్, తరువాత దిశా పఠానీ, నిన్న గోవింద, ఇవాళ్ల అర్జున్ కపూర్… రోజుకొకర్ని రొచ్చులోకి లాగి రచ్చ చేస్తున్నాడు!

కమాల్ రషీద్ ఖాన్ ని షార్ట్ గా కేఆర్కే అంటుంటారు. ఆయన పని ఇష్టానుసారం మాట్లాడుతూ సినిమా రివ్యూలు చేయటం, వీలైనప్పుడల్లా బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు చెబుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ ‘రాధే’ సినిమా గురించి అదే చేశాడు. మూవీ బాగోలేదని చెప్పటంతో సరిపెట్టలేదు. సల్మాన్ అవినీతిపరుడు, అతడి సినిమాల ద్వారా మనీ లాండరింగ్ చేస్తుంటాడు… అంటూ అసందర్భ ప్రేలాపనులు చేశాడు. ఒళ్లు మండిన భాయ్ జాన్ కేఆర్కే మీద పరుపు నష్టం దావా వేయించాడు తన లీగల్ టీమ్ చేత.

సల్మాన్ తో కోర్టు కేసు వివాదం కొనసాగుతుండగానే కేఆర్కే మరో రచ్చ చేయబోయాడు. దిశా పఠానీ మాజీ ప్రియుడి ఫోటోలు బయట పెట్టాడు. పైగా అతడ్ని ఆమెకు అన్నయ్య అంటూ వెటకారాలు చేశాడు. నెటిజన్స్ బాగా గడ్డి పెట్టడంతో పోస్టు, ఫోటోలు డిలీట్ చేశాడు. అవి తనకు ఎవరో పంపిస్తే ఆన్ లైన్ లో పెట్టానని కవరింగ్ ఇచ్చాడు!
సల్మాన్, దిశా పఠానీ తరువాత గోవింద పేరు గుర్తుకు వచ్చింది కేఆర్కేకి! సల్మాన్ ఖాన్ తన పై కేసు వేశాక గోవింద మద్దతుగా నిలిచాడని ఆయన సొషల్ మీడియాలో చెప్పాడు. గోవిందా వర్సెస్ సల్మాన్ గా వ్యవహారాన్ని తయారు చేయబోయాడు. కానీ, సీనియర్ హీరో గోవింద తనకు ఏమీ తెలియదని చెప్పాడు. కేఆర్కే ఒట్టి ‘న్యూసెన్స్’ అంటూ తీసిపారేస్తూనే… అతడికి, సల్మాన్ కు మధ్య ఏం జరిగిందో నాకు ఐడియా లేదని క్లారిటీ ఇచ్చాడు. గోవింద సూటిగా, సుత్తి లేకుండా స్పందించటంతో కేఆర్కే తాను చెప్పిన గోవింద మరెవరో అంటూ ప్లేటు ఫిరాయించాడు!

నోటికి వచ్చింది మాట్లాడి మళ్లీ కొత్త కబుర్లు చెప్పటం బాగా అలవాటైన కేఆర్కే ఇప్పుడు అర్జున్ కపూర్ కి థాంక్స్ చెప్పాడు. ఇక మీదట ఆయన సినిమాల్ని విమర్శించనని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇంతకీ ఎందుకు అంటే… అర్జున్ కపూర్ అతడికి మద్దతుగా నిలిచాడట. చాలా సేపు ఫోన్ లో పరామర్శించాడట. సల్మాన్ కు వ్యతిరేకంగా నిలబడిన ‘నువ్వు’ ఒక్కడివే బాలీవుడ్ లో మగాడివంటూ కేఆర్కే తెగ పొగిడేశాడు! మరి దీనిపై అర్జున్ కపూర్ ఏమంటాడో చూడాలి? ఆయన కూడా కేఆర్కే రచ్చని మొదట్లోని ఖండించే ఛాన్స్ ఉంది. లేదంటే అర్జున్ కపూర్ కి కూడా అనవసరపు సెగ తప్పదు!

కొసమెరుపు ఏంటంటే… ఇప్పుడు అర్జున్ కపూర్ ని పొగిడేస్తోన్న కేఆర్కే గతంలో అతను నటుడిగా పనికిరాడంటూ తీవ్రంగా విమర్శించాడు. నిర్మాత కొడుకు నిర్మాత కావాల్సిందేనంటూ తన ఇష్టానుసారం ట్వీట్ లు చేశాడు!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-