దిశ మాజీ ప్రియుడ్ని… ఆమెకు ‘అన్నయ్య’ అనుకున్నాడట!

సినిమా ఇండస్ట్రీలో పైకి అంతా అందంగానే కనిపిస్తుంది. కానీ, లోపలికి తొంగిచూస్తే బోలెడు వికారాలు వెగటు పుట్టిస్తాయి. అయితే, సొషల్ మీడియా వచ్చాక సినిమా వాళ్ల సీక్రెట్ గొడవలు ఆన్ లైన్ లో అందరి ముందుకు వచ్చేస్తున్నాయి. ఇక కమాల్ రషీద్ ఖాన్ లాంటి కొందరు నోటి దురుసు సొషల్ మీడియా సెలబ్రిటీలైతే మరింత రచ్చ చేస్తుంటారు. ఎవరి మీద అయినా ఏదంటే అది వాగేస్తుంటారు. కొన్ని సార్లు నిజాలు, చాలా సార్లు అబద్ధాలు నెటిజన్స్ పై కుమ్మరిస్తుంటారు. తాజాగా కేఆర్కే కన్ను దిశ పఠానీపై పడింది!
‘రాధే’ సినిమాలో సల్మాన్ సరసన నటించిన దిశ పఠానీ బీ-టౌన్ లో క్రమంగా క్రేజ్ పెంచుకుంటోంది. టైగర్ ష్రాఫ్ గాళ్ ఫ్రెండ్ గా కూడా ఆమె జనాల్లో ఫేమస్. అయితే, ఎందుకోగానీ… ఇష్టానుసారం ట్వీట్లు చేసే కేఆర్కే దృష్టి దిశాపై పడింది. వెంటనే టీవీ నటుడు పార్థ్ సంతాన్ తో ఆమె కలసి ఉన్న ఫోటోల్ని తన అకౌంట్లో పోస్ట్ చేశాడు. పైగా ‘దిశా, ఆమె సోదరుడు’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు!
దిశా పఠానీ ఎక్స్ లవ్వర్ గా పార్థ్ సంతాన్ బాలీవుడ్ లో ఫేమస్. అతడితో ఆమె ఓ సంవత్సరం పాటూ డేటింగ్ చేసింది. కానీ, ప్రస్తుతం టైగర్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. మరి ఇటువంటప్పుడు కేఆర్కే ఆమె పాత లవ్ స్టోరీని తవ్వి తీయటం ఎందుకు? పైగా ఆమె మాజీ ప్రియుడ్ని ‘సోదరుడు’ అంటూ వెటకారం చేయటం ఎందుకు? నెటిజన్స్ తమ నెగటివ్ క్యామెంట్స్ తో ఉతికి ఆరేశారు! అందుకే, కేఆర్కే తాను పోస్ట్ చేసిన దిశా, పార్థ్ ఫోటోల్ని డిలీట్ చేశాడు. కానీ, అప్పటికే కొందరు డౌన్ లోడ్ చేసేయటంతో ఇప్పుడా ఫోటోలు నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి!
దిశ మాజీ ప్రియుడి ఫోటోల వ్యవహారం బెడిసికొట్టడంతో కేఆర్కే సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ఆ ఫోటోలు తనకు ఆన్ లైన్ లోనే ఎవరో పంపారంటూ చెప్పుకొచ్చాడు. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు అంటూనే.. దిశతో ఉండటంతో ఆమె ‘బ్రదర్’ అనుకున్నాను అని విచిత్రమైన వివరణ ఇచ్చాడు!
ట్విట్టర్ లో తన పోస్టులు, సినిమా రివ్యూలతో రెగ్యులర్ గా రచ్చ చేస్తుంటాడు కేఆర్కే. ఎవరో ఒక సెలబ్రిటీని టార్గెట్ చేసి దుమారం రేపుతుంటాడు. ‘రాధే’ సినిమా రిలీజ్ తరువాత సల్మాన్ ఖాన్ ని విమర్శించాడు. సినిమా బాగాలేదని ఊరుకోకుండా వ్యక్తిగత ఆరోపణలకు దిగాడు. సల్మాన్ అవినీతిపరుడు, మనీ లాండరింగ్ చేస్తాడంటూ కేఆర్కే తిట్టిపోశారు. దాంతో భాయ్ జాన్ ఆఫ్ బాలీవుడ్ కేఆర్కేపై పరువు నష్టం దావా వేశాడు. ఇప్పటికీ వెనక్కి తగ్గని కేఆర్కే ‘నిన్ను రోడ్డు మీదకి తెచ్చి నిలబెడతా!’ అంటూ సల్మాన్ కు ఛాలెంజ్ విసిరాడు! చూడాలి మరి, సల్మాన్ ఖాన్ వర్సెస్ కమాల్ రషీద్ ఖాన్ గలాటాలో చివరకు ఏమవుతుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-