కృతి సనన్ ప్రెగ్నెన్సీ జర్నీ… “మిమి” టీజర్

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరోగసి డ్రామా విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్న ఈ చిత్రానికి సంబంధించి కృతి సనన్ ఫస్ట్ లుక్ విడుదల కాగా, నేడు మరో అప్డేట్ ను అందించారు మేకర్స్. జూలై 13న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాబోతోందని తెలుపుతూ ఓ టీజర్ ను విడుదల చేశారు. అందులో కృతి సనన్ ప్రెగ్నెన్సీ జర్నీని చూపించారు. అంతా అనుకుంటున్నట్లుగా కాకుండా ఎదో స్పెషల్ గా ఉంటుందని హామీ ఇచ్చింది కృతి. ఈ టీజర్ చూస్తుంటే అది ఆమె హామీ నెరవేర్చినట్టే అన్పిస్తోంది.

Read Also : రణవీర్ సింగ్ గ్యారేజ్ లోకి ‘కొత్త అతిథి’! 2.43 కోట్లు విలువ చేసే కార్!

పంకజ్ త్రిపాఠి, సాయి, సుప్రియ, మనోజ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించారు. ఈ విభిన్నమైన చిత్రానికి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహిస్తుండగా మాడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల గురించి బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-