అనుష్క, భూమి పెడ్నేకర్ బాటలో కృతీ సనన్

నాజూకు నడుము భామలు ఒక్కసారిగా లావైపోతే అస్సలు బాగోదు. కానీ ఏం చేస్తాం… ‘స్టోరీ డిమాండ్ చేసింది’ అంటూ కొందరు అందాల ముద్దుగుమ్మలు కథ కోసం కేజీల కొద్ది బరువు పెరిగేశారు. 2015లో వచ్చిన ‘సైజ్ జీరో’ కోసం అనుష్క అదే పనిచేసింది. సన్నగా కనిపించాల్సిన సన్నివేశాల్లో మొదట నటించేసి, ఆ తర్వాత పాత్ర కోసం విపరీతంగా లావైపోయింది. ఇప్పటికీ మనుపటి శరీరాకృతిని అనుష్క పొందలేకపోయింది. కానీ చిత్రంగా భూమి పెడ్నేకర్ మాత్రం ఆ విషయంలో సక్సెస్ అయ్యింది. 2015లోనే ఆమె ‘దమ్ లగా కే ఐసా’ చిత్రం కోసం విపరీతంగా లావైపోయింది. ఆ తర్వాత మళ్ళీ నాజూకుగా మారిపోయింది.

ఇక ప్రస్తుతానికి వస్తే… తెలుగులో మహేశ్ బాబు ‘నేనొక్కడినే’ మూవీతో తెరంగేట్రమ్ చేసిన మోడల్ కృతీ సనన్ స్టోరీ డిమాండ్ కారణంగా ‘మిమి’ సినిమా కోసం ఏకంగా 15 కేజీల వెయిట్ పెరిగింది. ఈ సినిమాలో అమ్మడు సర్రొగసి మదర్ గా నటిస్తోంది. బేబీ బంప్ కోసం ప్రొస్తెటిక్ మేకప్ ఉపయోగించినా, బాడీ కూడా కాస్తంత లావుగా కనిపించాలని దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్ ఆదేశించాడట. 2019లో అక్టోబర్ లో తొలి షెడ్యూల్ పూర్తి కాగానే దర్శకుడు చెప్పిన మాటలను సీరియస్ గా తీసుకున్నానని కృతీసనన్ చెప్పింది. అప్పటి నుండి రెండు నెలల పాటు ఆయిల్ ఫుడ్, స్వీట్స్ విపరీతంగా తిన్నానని తెలిపింది. ఆ సమయంలో ఆకలి లేకపోయినా ప్రతి రెండు గంటలకూ ఏదో ఒక ఆహారం తీసుకున్నానని చెప్పింది. వర్కౌట్స్ తో పాటు యోగా కూడా చేయలేదని దాంతో పదిహేను కేజీలు పెరిగానని అంది. విశేషం ఏమంటే ప్రస్తుతం ‘మిమి’ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కృతీసనన్ తిరిగి మళ్ళీ తన పాత ఫిజిక్ ను సంపాదించేసుకుంది. ప్రభాస్ త్రీ డీ మూవీ ‘ఆదిపురుష్’తో పాటు ‘బచ్చన్ పాండే’, ‘భేడియా’ చిత్రాలలో కృతీ సనన్ నటిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-