పది కోట్లు డిమాండ్ చేస్తున్న కృతిసనన్

మహేశ్ బాబు ‘వన్.. నేనొక్కడినే’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయింది. ‘రాబ్తా’, ‘బరేలి కి బర్ఫీ’, ‘స్ట్రీ’, ‘లుకా చుప్పి’, ‘కళంక్’, ‘పానిపట్’, ‘హౌస్ ఫుల్4’ వంటి సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా ‘మిమి’ సినిమాతో సూపర్ స్టార్ హీరోయిన్ అయింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా కృతి ఇమేజ్ ని ఆకాశమంత ఎత్తుకు పెంచింది. దాంతో అమ్మడు తన పారితోషికాన్ని భారీ స్థాయిలో పెంచేసిందట.

Read Also : ట్రెండింగ్ లో “లెహరాయి” లిరికల్ వీడియో సాంగ్

‘హమ్ దో హమారే దో’, ‘బచ్చన్ పాండే’, ‘భేదియా’ సినిమాలను పూర్తి చేసిన కృతి ప్రభాస్ తో కలసి ఓం రౌత్ తీస్తున్న ‘ఆదిపురుష్’ లో సీతగా నటిస్తోంది. ‘ఆదిపురుష్’ సినిమాకే రెమ్యూనరేషన్ బాగా పెంచిన కృతి తదుపరి కమిట్ అవనున్న సినిమాలకు పది కోట్ల వరకూ డిమాండ్ చేస్తోందట. అయితే ప్రస్తుతం అమ్మడికి ఉన్న క్రేజ్, మార్కెట్ చూసి మేకర్స్ కూడా అమె అడిగిన మొత్తం చెల్లించడానికి వెనుకాడడం లేదట. మరి కృతి ఎంత కాలం తన క్రేజ్ ను కొనసాగిస్తుందో చూద్దాం.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-