స్టార్ హీరోతో కృతిశెట్టి లిప్ లాక్… మరోసారి ట్రెండింగ్ లో… !

ఈ ఏడాది మొదట్లో “ఉప్పెన” సినిమా విడుదలైనప్పుడు బెంగళూరు బ్యూటీ కృతి శెట్టి పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మారు మ్రోగిపోయింది. ఈ సినిమాలో ఆమె అందం, అభినయం చూసిన మేకర్స్ వరుసగా కృతికి ఆఫర్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె నాని, నాగ చైతన్యతో కలిసి రెండు పెద్ద చిత్రాలలో నటిస్తోంది. ఇతర ప్రాజెక్ట్‌ల కోసం చర్చలు జరుగుతున్నాయి. అయితే తెరపై స్కిన్ షోలు, హాట్ రొమాన్స్‌లకు తాను ఒప్పుకోనని ముందుగానే ఈ యంగ్ బ్యూటీ స్పష్టం చేసింది. అయితే సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పిక్ ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. అందులో ఓ స్టార్ హీరోతో కృతి శెట్టి లిప్ లాక్ చేయడం కన్పిస్తోంది.

Read Also : ‘ఎంసిఏ’ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న నాని

విషయంలోకి వెళ్తే… అయితే నాని ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాలో సాయి పల్లవితో పాటు కృతి శెట్టి కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే టీజర్లో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఏం కన్పించలేదు. కానీ చివర్లో వచ్చిన సన్నివేశం మాత్రం అందరికి ట్విస్ట్ ఇచ్చింది. అందులో కృతిశెట్టి, నాని మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీని కారణంగా మరోసారి సోషల్ మీడియాలో కృతి ‘ఉప్పెన’ కొనసాగుతోంది. మరి దీనిపై యంగ్ హీరోయిన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles