నాగలక్ష్మిగా కృతి శెట్టి… ‘బంగార్రాజు’ నుంచి ఫస్ట్ లుక్

కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘బంగార్రాజు’. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శరవేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ అక్కినేని అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి కృతిశెట్టి ఫస్ట్‌లుక్‌ ను హీరో నాగచైతన్య ఆవిష్కరించారు.

Read Also : రాయాలన్నా, కాల రాయాలన్నా… మీడియాపై నాని కామెంట్స్

కృతి శెట్టి లుక్ పై స్పందిస్తూ ‘బాగుంది. “బంగార్రాజు” లుక్‌ ఏది? అంటూ నాగార్జున అడిగిన ప్రశ్నకు సమాధానంగా చై ‘లేడీస్ ఫస్ట్’ అంటూ చమత్కరించారు. “కృతి శెట్టిని మా నాగలక్ష్మిగా పరిచయం చేస్తున్నా.. ఫస్ట్ లుక్ ఇదిగో’’ అని నాగ చైతన్య ట్వీట్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కృతి ఆకుపచ్చ చీర కట్టుకుని అందంగా కనిపిస్తోంది. ఆమె ఎడమచేతిలో నల్లటి షేడ్స్ పట్టుకుని అదే చేతిని ఊపుతోంది. ఆమె మెడలో ఒక దండ ఉండడం ఆసక్తికరంగా ఉంది. ఈ లుక్ చూస్తుంటే ఆమె రాజకీయ నాయకురాలిగా కన్పిస్తోంది. ‘బంగార్రాజు’లో తన లుక్ పై కృతి శెట్టి స్పందిస్తూ “పరిచయం చేసినందుకు ధన్యవాదాలు నాగ చైతన్య. నాగ లక్ష్మి కావడం నాకు చాలా ఆనందంగా ఉంది !!!” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Related Articles

Latest Articles