తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ… ఆ డీపీఆర్‌లు ఇవ్వండి..!

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింత ముదురుతున్నాయి. కృష్ణా జలాలపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు పోటాపోటీగా లేఖలు రాస్తున్నాయి. అయితే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు లేఖ రాసింది… రాష్ట్రంలో కృష్ణా బేసిన్ పై నిర్మించిన, నిర్మాణం చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని లేఖలో పేర్కొంది కేఆర్‌ఎంబీ… కాగా, ఇప్పటి వరకు ఒక రాష్ట్రం పై మరో రాష్ట్రం ఆరోపణలు చేస్తూ రాగ… ప్రస్తుతం తమ వాటాల ప్రకారం నీటిని కేటాయించాలని లేఖలు రాస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబికి రాసిన లేఖలో వాటాల ప్రస్తావనే వివాదాస్పదంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అభ్యంతరాలు చెబుతున్నారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం జలాశయానికి 4 లక్షల క్యూసెక్కులకుపైగా వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం ఇప్పటికే మినిమం డ్రా డౌన్ లెవల్ దాటి పోయింది. 863.70అడుగుల నీటి వద్ద, జలాశయంలో 117.77 టిఎం సిల నీరునిలువ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఎపి ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి 27 టిఎంసిల నీటిని వినియోగించుకునేందుకు బోర్డును అనుమతి కోరింది. ఈ నీటిలో చెన్నై నగర తాగునీటి అవసరాలకు 3 టిఎంసిలు, తెలుగుగంగ కాలువకు 7 టిఎంసిలు, శ్రీశైలం కుడిగట్టుకాలువ పథకం, గాలేరు నగరి పథకానికి కలిపి 8టిఎంసిలు, హంద్రీనీవా పథకానికి 7 టిఎంసిలు, కర్నూలు-కడప కాలువకు 2 టీఎంసీలు అవసరం అని లేఖ ద్వారా కృష్ణా రివర్ బోర్డుకు వివరించింది. అయితే తెలంగాణ రాష్ట్రం వినియోగించుకున్న నీటి లెక్కల ప్రస్తానే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. కృష్ణా జలాలను ఇప్పటివరకు వాడుకుందని ఎపి తన లేఖ ద్వారా బోర్డుకు తెలిపింది. అంతేకాకుండా ఎపికి 66 శాతం, తెలంగాణకు 34 శాతం దామాషా పద్ధతిలో … తమకు కూడా 160టిఎంసిల నీటిని వాడుకునే హక్కు కల్పించాలని బోర్డుకు లేఖద్వారా తెలిపింది ఏపీ సర్కార్.. దీనిపై తెలంగాణ నీటిపారుదల శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కేఆర్‌ఎంబీయే… తెలంగాణ సర్కార్‌కు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-