పారాలింపిక్స్‌ : భారత్ ఖాతాలో 5వ స్వర్ణం

పారాలింపిక్స్‌ లో భారత్ ఖాతాలోకి మరో స్వర్ణం వచ్చి చేరింది. తాజాగా పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ SH6 విభాగంలో కృష్ణ గోల్డ్ గెలిచాడు. సెమిస్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్స్ కు చేరుకున్న కృష్ణ ఇక్కడ అదే జోరు చూపించాడు. ఫైనల్స్ లో హాంకాంగ్ ప్లేయర్ పైన మొదటి రౌండ్ ను 21-17 సొంతం చేసుకున్న కృష్ణ రెండో రౌండ్ ను 16-21 తో కోల్పోయాడు. కానీ చివరిదైన మూడో రౌండ్ లో మళ్ళీ పుంజుకొని 21-17 తో రౌండ్ తో పాటు మ్యాచ్ లో కూడా విజయం సాధించి ఇండియాకు 5వ స్వర్ణ పతాకాన్ని తీసుకొచ్చాడు. కృష్ణ గోల్డ్ తో పతకాల పట్టికలో భారత్ మొత్తం 19 పతకాలతో 24వ స్థానానికి చేరుకుంది. అయితే ఈరోజు పారాలింపిక్స్‌ చివరి రోజు అనే విషయం తెలిసిందే. కాబట్టి చూడాలి మరి ఇంకా ఎన్ని పతకాలు మన ఖాతాలోకి వస్తాయి అనేది.

Related Articles

Latest Articles

-Advertisement-