పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోతే కొండ పోలం సినిమా ఉండేది కాదు…

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో రూపొందిన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ “కొండపోలం”. ఉప్పెన హీరో వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తుండగా… వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ రోజు కొండ పొలం ఆడియో రిలీజ్ జరిగింది. ఇందులో దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోతే కొండ పోలం సినిమా ఉండేది కాదు అని అన్నారు. భారీ బడ్జెట్ తో ఆయనతో సినిమా చేస్తున్న సమయంలో మధ్యలో కొంత గ్యాప్ ఉంటె.. అందులో నేను ఈ సినిమా చేస్తాను అని చెప్పినప్పుడు ఆయన ఒప్పుకున్నారు. అప్పుడు ఆయనకు ఇందులో హీరో ఎవరు అనేది కూడా తెలియదు అని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో పాటుగా ఈ సినిమా రూపుదిద్దుకోవడంలో చాలా మంది ముఖ్య పాత్ర పోషించారని.. అందులో ఒక్కరు లేకపోయినా ఈ సినిమా ఉండేది కాదు అని దర్శకుడు క్రిష్ చెప్పారు. ఇక ఈ సినిమా అంత ఒక్క ఎత్తయితే ఎంఎం కీరవాణి అందించిన సంగీతం మరో ఎత్తు అని పేర్కొన్నారు. ఇక హీరోయిన్ రకుల్ ది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పారు దర్శకుడు క్రిష్.

-Advertisement-పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోతే కొండ పోలం సినిమా ఉండేది కాదు…

Related Articles

Latest Articles