జైపూర్‌ పాఠశాలలో 11 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్

కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా నివారణ చర్యలు ఎన్ని తీసుకున్నా దాని పని అది సైలైం ట్‌గా చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా జైపూర్‌లోని ఓ పాఠశాలలో 11 మంది విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో ఆపాఠశా లను ప్రభుత్వం మూసివేసింది. కోవిడ్‌ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పాఠశాలలను మూసివేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల విరామం తర్వాత, సెప్టెంబర్ నుం డి రాజస్థాన్‌లో పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు తిరిగి తెరు చుకున్నాయి. పాఠశాలలు 9 నుండి 12 తరగతులకు 50 శాతం సామర్థ్యంతో తిరిగి తెరిచారు.

అయితే 1 నుండి 8 తరగతులు ప్రస్తుతానికి ఆన్‌లైన్ తరగతులతో కొనసాగుతాయి.రాష్ట్రంలోని గెహ్లాట్ ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుండి 50 శాతం సామర్థ్యంతో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని కోరింది. కోవిడ్ 19 వ్యాక్సిన్‌లో కనీసం మొదటి డోస్ అయినా వారికి అందేలా చూడాలని ఉపాధ్యాయ సిబ్బందిని కోరారు. అయితే ఆ పాఠశాలలో కరోనా వ్యాపించకుండా అధికారులు శానిటేషన్‌ పనులు చేయిస్తున్నారు.

Related Articles

Latest Articles