రేపే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా : కౌశిక్‌ రెడ్డి

హుజురాబాద్ అభివృద్ధి జరగాలంటే టీఆరెఎస్ లో చేరాల్సిందే అని తన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారని.. అందరి కోరిక మేరకు తాను రేపు టీఆరెఎస్ లో చేరుతున్నట్లు కౌశిక్ రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ సమక్షంలో రేపు 1 గంటకు టీఆర్‌ఎస్‌ లో చేరుతున్నానని.. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని చెప్పారు..

read also : టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక..

దళిత బంధు హుజూరాబాద్ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందని… హుజురాబాద్ అభివృద్ధి జరగాలనే తాను టీఆరెఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈటెల రాజేందర్ అన్ని రోజులుగా మంత్రిగా ఉన్నా .. హుజురాబాద్ ను పట్టించుకోలేదని ఫైర్‌ అయ్యారు. ఈటెల కేవలం వ్యక్తిగతంగా ఆర్థికంగా బలోపేతం అయ్యాడని… ఈటెల అవినీతి ఆరోపణలతోనే రాజీనామా చేశాడని విమర్శించారు. ఇప్పుడు ఆత్మగౌరవం అనడం సరికాదని..ఇక నుంచి హుజురాబాద్ లో ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు..

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-