భక్తి టీవీ కోటి దీపోత్సవం.. జ్వాలాతోరణం రమణీయం

జయ జయ శంకర… శివ శివ శంకర… శంభో శంకర.. హర హర మహాదేవ.. శివ శివ శంకర.. హరహర శంకర అంటూ హైదరాబాద్‌ ఎన్టీఆర్ స్టేడియం మారుమోగిపోయింది. భక్తుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఈనెల 12వ తేదీన ప్రారంభమయిన భక్తి టీవీ కోటిదీపోత్సవం అప్రతిహతంగా సాగిపోతోంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా భక్తిటీవీ కోటి దీపోత్సవం నిర్వహించారు. వేలాదిగా హాజరైన భక్తులు జ్వాలాతోరణం వీక్షిస్తూ పరవశించారు. నిండుపున్నమి వెలుగులో శ్రీశైల మల్లన్న కల్యాణం కమనీయంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాదిమంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

భక్తి టీవీ కోటి దీపోత్సవం.. జ్వాలాతోరణం రమణీయం

కార్తిక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం శ్రీవిశ్వ ప్రసన్నతీర్థస్వామి పెజావర్ అధోక్షజ మఠం, ఉడిపి, శ్రీవిద్యాప్రసన్న తీర్థస్వామి, సుబ్రహ్మణ్య మఠం, కుక్కే, శ్రీ రఘువరేంద్రతీర్థస్వామి మధ్యమూల సంస్థానం, కర్నాటక స్వామీజీలు అనుగ్రహ భాషణం చేశారు. బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రవచనాలు అందించారు. ఉజ్జయిని శివలింగానికి భస్మహారతి, బిల్వార్చన కావించారు. శివలింగాలకు వేలాదిమంది భక్తులే బిల్వార్చన చేశారు. అనంతరం నేత్రపర్వంగా శ్రీ శ్రీశైల మల్లికార్జున స్వామి కల్యాణం నిర్వహించారు. ఈ వేడుక చూడడానికి వేలాదిమంది తరలివచ్చారు. తదుపరి నందివాహన సేవ, జ్వాలాతోరణం నిర్వహించారు. వేదికపై ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్రచౌదరి, రమాదేవి దంపతులు కార్తీక దీపారాధన చేశారు.

Related Articles

Latest Articles