8వ రోజు : కార్తీకపౌర్ణమి వేళ.. కైలాసనాథుడి కళ్యాణోత్సవం..

భక్తిటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం వేడుక ఈ సంవత్సరం కూడా భక్తకోటిని ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తుతోంది. నవంబర్‌ 12వ తేదిన అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ కోటి దీపోత్సవ వేడుక నేడు 8వ రోజుకు చేరుకుంది. ఈ రోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని విశేషాలను చూద్దాం.. బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుచే ప్రవచనామృతం.

అనంతరం మొట్టమొదటిసారిగా ఉజ్జయిని అర్చకులచే మహాకాళేశ్వర భస్మహారతి, బిల్వార్చన కార్యక్రమం వేదికపైనే కాకుండా భక్తులచే కూడా నిర్వహించనున్నారు. ఆ తర్వాత కైలాసాధీశుడు శ్రీశైల మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించనున్నారు. అనంతరం నందివాహనంపై స్వామివార్లను భక్తులను ఆశీర్వదించేందుకు కోటి దీపోత్సవ వేదిక ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించనున్నారు.

జ్వాలాతోరణ మహోత్సవ అపూర్వఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. వెనువెంటనే భక్తులచే దీపార్చన కార్యక్రమం కోటిదీపోత్సవ కార్యక్రమానికే హైలెట్‌గా నిలుస్తుంది. ఇక స్వర్ణ లింగోద్భవ సన్నివేశం కార్తీకపున్నమి వెలుగుల్లో కన్నులారా చూసి తరించాల్సిందే. స్వామి వారికి నివేదించే నాగ, నంది, నక్షత్ర, కుంభ, బిల్వ, సింహా, రుద్ర హారతులను చూసి పుణ్యం పొందడమే తప్పా వర్ణించలేం.

ఆద్యంతం ఆ లయకారుడి వైభవాన్ని చూడాలంటే కోటి దీపోత్సవం కార్యక్రమానికి వెళ్లాల్సిందే.. ఈ రోజు సాయంత్రం 6గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో.. వివిధ ప్రాంతాల నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్య కలదు. 7వ రోజు కోటి దీపోత్సవంలో ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వరుడి కళ్యాణోత్సవం హైలెట్స్‌ కింది వీడియోలో వీక్షించండి.

Related Articles

Latest Articles