7వ రోజు: శ్రీవేంకటేశ్వరుడి కల్యాణం చూతము రారండి.. కోటి దీపోత్సవంలో..

ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగా ఈ సంవత్సరం కూడా భక్తిటీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా అలరారుతోంది. కోటి దీపోత్సవం కార్యక్రమం ఈ నెల 12 నుంచి 22 వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు 7వ రోజును పురస్కరించుకొని విశేష కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు వైకుంఠ చతుర్ధశిని పురస్కరించుకొని శ్రీ వేంకటేశ్వర స్వామి ముడుపుల పూజ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించనున్నారు.

అంతేకాకుండా తన ప్రవచనాలతో ఇటు యువతను, అటు పెద్దలను ఆకర్షించిస్తూ.. హాస్యాస్పదమైన చురకలంటించే బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు ప్రవచానమృతం ఏర్పాటు చేశారు. వీటితో పాటు ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణం కన్నుల పండువగా జరుగనుంది. అనంతరం గరుడ వాహనంపై స్వామివార్ల ఊరేగింపుగా దర్శనమివ్వనున్నారు. అనంతరం భక్తకోటి వెలిగించనున్న దీపాలంకరణలో దర్శనమిచ్చే సాంబశివుడి దర్శనం.

దైవ భక్తితో ఓం నమఃశివాయ అను పంచాక్షరి నామ ధాన్యాల నడుమ బంగారు లింగోద్భవ ఘట్టం చూసి తీరాల్సిందే. ఇకపోతే ఆ తరువాత నిర్వహించే సప్తహరతులను దర్శించి పునీతులమవడం పూర్వజన్మ సకృతమే.. కోటి దీపోత్సవం.. ఓ సారి సందర్శించాల్సిన ప్రదేశం. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు. ఎన్టీఆర్‌ స్టేడియంలో. వివిధ ప్రాంతాల నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. 6వ రోజు కోటి దీపోత్సవం హైలెట్స్ కింది వీడియోలో వీక్షించండి.

Related Articles

Latest Articles