విమానంలో విష వైరస్… ‘కాన్స్’లో కలకలం రేపిన ‘ఎమర్జెన్సీ డిక్లరేషన్’!

ఫ్రాన్స్ లో ప్రస్తుతం ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ నడుస్తోంది. అయితే, తాజాగా ‘ఎమర్జెన్సీ డిక్లరేషన్’ అనే సినిమా ప్రదర్శించారు. సదరు చిత్రం మొదలయ్యాక చూడటానికి వచ్చిన వారంతా తమ ముఖాలకున్న మాస్కుల్ని అప్రయత్నంగా సరి చేసుకుంటూ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు! ఎందుకంటే… సౌత్ కొరియన్ మూవీ ‘ఎమర్జెన్సీ డిక్లరేషన్’ ఓ వైరస్ డిజాస్టర్ మూవీ! అంతే కాదు, ఒక బయోకెమిస్ట్ పగతో ఆకాశంలో ఎగురుతోన్న విమానంలో డెడ్లీ వైరస్ స్ప్రెడ్ చేస్తాడు. దాంతో గాలి ద్వారా వైరస్ సోకి ప్యాసింజర్స్ ఒక్కొక్కరుగా మరణిస్తుంటారు! ఇటువంటి షాకింగ్ థ్రిల్లర్ ప్రపంచం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరినైనా వణికించక మరేం చేస్తుంది?

కాన్స్ లో ప్రదర్శనకొచ్చిన ‘ఎమర్జెన్సీ డిక్లరేషన్’ ఇప్పుడు ఇంటర్నేషనల్ టాపిక్ గా మారింది. ఆ సినిమా దర్శకుడు తాను కథ రాసుకున్నది ‘కోవిడ్ 19’ కంటే ముందేనని చెబుతున్నాడు. తమకు కేవలం ‘సార్స్’ వైరస్ మాత్రమే తెలుసునని చెప్పాడు. కానీ, 2020లో షూటింగ్ జరుపుతుండగా కరోనా ప్రపంచాన్ని కబళించేసింది. తమ సినిమాలో చూపిందే బయట ప్రపంచంలో మరింత దారుణంగా, భీకరంగా జరగటం మొదట్లో ‘ఎమర్జెన్సీ డిక్లరేషన్’ టీమ్ ని కూడా షాక్ కి గురిచేసిందట. ఒక దశలో వారు తమ సినిమా రిలీజ్ తరువాత జనం అసలు చూస్తారా అని కూడా అనుమానపడ్డారట. ఎందుకంటే, మూవీలో ఒక విమానంలో ఏం జరుగుతుందో అటువంటిదే గత రెండేళ్లుగా ప్రపంచం అంతటా జరుగుతోంది!

‘ఎమర్జెన్సీ డిక్లరేషన్’ సినిమా ప్రదర్శన తరువాత కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విమర్శకుల ప్రశంసలు పొందింది. మేకింగ్ పరంగా సౌత్ కొరియన్ టెక్నీషియన్స్ అద్భుతం చేసి చూపించారు. సినిమా దాదాపుగా మొత్తం అంతా విమానంలోనే సాగుతుంటుంది. అందుకే, చాలా కష్టపడి హ్యాండ్ హెల్డ్ కెమెరాలతో చాలా సీన్స్ చిత్రీకరించారు. విమానం గాల్లో గింగిరాలు తిరుగుతున్నట్టు చూపించేందుకు కూడా కెమెరా మెన్ ఎంతో రిస్క్ చేసి పిక్చరైజ్ చేశారట! ‘ఎమర్జెన్సీ డిక్లరేషన్’ అందరికీ అందుబాటులోకి ఎప్పుడు వస్తుందోగానీ… వస్తే మాత్రం మనమూ తప్పక చూడాల్సిన చిత్రమే!

విమానంలో విష వైరస్… ‘కాన్స్’లో కలకలం రేపిన ‘ఎమర్జెన్సీ డిక్లరేషన్’!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-