‘కొండపొలం’కు క్లీన్ యు!

తొలి చిత్రం ‘ఉప్పెన’తో చక్కని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా ‘కొండపొలం’. సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కిందీ సినిమా. రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, కోట శ్రీనివాసరావు, రవిప్రకాశ్, హేమ తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘కొండపొలం’ సినిమాను క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు. ఈ నవలా చిత్రాన్ని ఇదే నెల 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. గురువారం విడుదల చేసిన ఈ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇదే సమయంలో ఈ సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ ను అందించారు దర్శక నిర్మాతలు. ‘కొండపొలం’ సినిమాకు సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. అతి త్వరలోనే కర్నూలులోనూ, ఆ తర్వాత హైదరాబాద్ లోనూ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ కు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం!

-Advertisement-'కొండపొలం'కు క్లీన్ యు!

Related Articles

Latest Articles