ముగిసిన కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక

తీవ్ర ఉత్కంఠ మధ్య కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చేయి ఎత్తి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబుకు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి జోగి రాముకు వైసీపీ కౌన్సిలర్ల మద్దతు లభించింది. టీడీపీ వైస్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు లక్ష్మీ, శ్రీనివాస్ కు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు.

ఎక్స్ అఫిషీయో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ ఎమ్మెల్యే వసంత. తుది ఫలితాన్ని హైకోర్టుకు నివేదించనున్నారు ఎన్నికల అధికారులు. ఎంపీ కేశినేని నాని ఓటును పరిగణనలోకి తీసుకోవాలా..? వద్దా..? అనే అంశంపై తీర్పు ఇవ్వనుంది హైకోర్టు. హైకోర్టు తీర్పు మీదే ఆధారపడి వుంది కొండపల్లి ఛైర్ పర్సన్ సీటు వ్యవహారం. ఎన్నిక ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు కోర్టుకి సమర్పించనున్నారు. కోర్టు ఆదేశాల అనంతరం తుది ఫలితాలను ప్రకటించనున్నారు.

అంతకుముందు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించా అధికారులు.ప్రమాణ స్వీకారం తర్వాత ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ల ఎన్నిక చేపట్టారు. వైసీపీ తరపున ఛైర్ పర్సన్ అభ్యర్ధిగా జోగి రాము, టీడీపీ తరపున ఛైర్ పర్సన్ అభ్యర్థిగా చెన్నుబోయిన చిట్టిబాబు పేర్లను ప్రతిపాదించాయి వైసీపీ, టీడీపీలు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని చెట్ల కిందే కూర్చున్నారు టీడీపీ సభ్యులు. సభ్యులను ఒక్కొక్కరిగా కౌన్సిల్ హాల్లోకి అనుమతించారు అధికారులు. అనంతరం ప్రమాణ స్వీకారం జరిగింది. కోర్టు ఆదేశాలు వుండడంతో అధికారులు ఈ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

Related Articles

Latest Articles