రేపే కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక..!

రేపు ఉదయం 10:30కు కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక జరుగనుంది. కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ రేపే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌన్సిలర్లకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని తెలిపింది. నిన్న, ఇవాళ జరిగిన ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను అడ్డుకునేలా అధికార పార్టీ వ్యవహరించిందన్న పిటిషనర్ తరపు న్యాయవాది… వైసీపీ సభ్యులు కౌన్సిల్ హాల్లో చేసిన హంగామాకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కేశినేని నాని ఓటు వినియోగంపై ఈ సందర్భంగా ప్రతివాదనలు వినిపించారు. ఎంపీ కేశినేని నానీ ఓటేసుకోవచ్చని.. అయితే ఆ ఓటును పరిగణనలోకి తీసుకోవాలా..? వద్దా..? అనేది తాము నిర్ణయిస్తామని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయం తర్వాతే కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఫలితం ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related Articles

Latest Articles