ఈటలకు మద్దతుగా మాజీ ఎంపీ కొండా లేఖ !

హుజూరాబాద్ ఉప ఎన్నిక హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. అధికార, విపక్ష నేతలు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ మంత్రి ఈటలను ఎలాగైనా ఓడించాలని అధికార టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈటల రాజేందర్ అదేస్థాయిలో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. కేసీఆర్ అహంకారానికి.. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి పోటీగా అభివర్ణిస్తున్నారు.

తాజాగా ఈటల రాజేందర్ కు మద్దతుగా, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి లేఖ రాసారు. హుజూరాబాద్ ఓటరుగా మీకు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉందన్న మాజీ ఎంపీ, లేఖలో చాలా అంశాలను ప్రస్తావించారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇప్పుడున్న టీఆర్‌ఎస్ నేతలు ఒక్కడు కూడా ఇక్కడ ఉండడని.. రాజేందర్ ఒక్కడే ఉంటాడని అన్నారు. విశ్వేశ్వరరెడ్డి టీం నియోజకవర్గం లోని ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తోంది. ఆయన లేఖ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

-Advertisement-ఈటలకు మద్దతుగా మాజీ ఎంపీ కొండా లేఖ  !

Related Articles

Latest Articles