ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నాడు, చేతులారా నీళ్లు వదులుతున్నాడు

నీళ్లు.. నిధులు.. నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పులపాలు చేస్తున్నాడని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. నీళ్లు చేతులారా వదులుతున్నాడు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నాడు.. నిధులు ఎలాగో లేవు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసాడని ఆరోపించాడు. రంగారెడ్డికే కాదు.. పశ్చిమ తెలంగాణకి చుక్క నీరు రానివ్వకుండా చేసాడు. రాష్ట్రానికి దరిద్రం పట్టుకోవడం కాదు…కేసీఆర్ కుటుంబం పట్టుకుందని విమర్శలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లో హుజూరాబాద్‌లో కేసీఆర్‌ని ఓడిస్తామని తేల్చి చెప్పారు. ఇందుకోసం అన్ని పార్టీల నాయకుల మద్దతు కోరతామని వెల్లడించారు. మరోవైపు, చెరుకు సుధాకర్ కూడా హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటలకు మద్దతు ఇస్తానని తనకు హామీ ఇచ్చినట్లు కొండా తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-