తెలంగాణలో ఇక మాదే అధికారం : కొండా రాఘవరెడ్డి

కడప : షర్మిల పార్టీ ప్రకటన నేపథ్యంలో కొండా రాఘవరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఇడుపులపాయ వైఎస్ ఘాట్ వద్ద షర్మిలతో పాటు ఆయన కొండా రాఘవరెడ్డి నివాళర్పించారు. ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ ఆర్ జయంతి సందర్భంగా నేడు తెలంగాణా వైఎస్ఆర్ పార్టీని ప్రారంభిస్తున్నామని… తెలంగాణా సంస్కృత, సంప్రదాయం ప్రకారం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఉంటాయని స్పష్టం చేశారు.

read also : తెలంగాణలో కాంగ్రెస్‌ పాదయాత్ర..ఇవాళే కీలక ప్రకటన !

రాజన్న రాజ్యం స్థాపనే ధ్యేయంగా ముందుకు వెలుతామని ప్రకటించారు. 2023 ఎన్నికల్లో తెలంగాణా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పార్టీ ఆవిర్భావ వేడుక ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని షర్మిల పార్టీ మద్దతుదారుడు కొండా రాఘవరెడ్డి అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-