పీసీసీ చీఫ్ తప్పితే… ఏ పదవి తీసుకోను : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కాంగ్రెస్ కి చావు లేదు… వచ్చే టోల్లు వస్తారు… పోయే వాళ్ళు పోతారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారం, పది రోజుల్లో పీసీసీ చీఫ్ నియామకం జరుగుతుంది. పీసీసీ చీఫ్ పదవి తప్పితే… ఏ పదవి తీసుకోను. పీసీసీ పదవి ముఖ్య మంత్రి పదవి కాదు. పీసీసీ ఇస్తే రాష్ట్రం అంతా తిరుగుతా.. లేదంటే ఉమ్మడి నల్గొండలో మెజారిటీ సీట్లు గెలిపించే బాధ్యత తీసుకుంటా అని తెలిపారు. నాకు పదవులు ముఖ్యం కాదు. రాజగోపాల్ రెడ్డితో.. పార్టీ మార్పు పై నేను మాట్లాడ లేదు. అన్న ఓ పార్టీ…తమ్ముడు ఇంకో పార్టీ లో ఉంటే తప్పు ఎంటి అని ప్రశ్నించారు. మాది ఉమ్మడి కుటుంబం… మా మధ్య రాజకీయాలు చర్చకు రావు. రేవంత్ ఒక్కడే కాదు.. వీహెచ్.. జగ్గారెడ్డిలు కూడా పీసీసీ అడుగుతున్నారు. కానీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నాకే మద్దతు ఇస్తున్నారు అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-