ఆ స్టార్ హీరో ప్రేమలో నిధి అగర్వాల్.. త్వరలోనే పెళ్లి..?

సవ్యసాచి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ నిధి అగర్వాల్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోయినా నిధికి మాత్రం అవకాశాలను బాగానే తెచ్చిపెట్టింది. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న హాట్ బ్యూటీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఒక పక్క టాలీవుడ్ లో చేస్తూనే కోలీవుడ్ లోను స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడిందంటూ కోలివుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. కోలీవుడ్ మన్మధుడు శింబు, నిధి అగర్వాల్ డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. శింబు లవ్ స్టోరీస్, బ్రేకప్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నయనతార, త్రిష, హన్సిక లాంటి హీరోయిన్లతో శింబు రిలేషన్ లో ఉండడం తరువాత విడిపోవడం తెల్సిందే.

ఇక తాజాగా నిధితో శింబు రిలేషన్ కొనసాగిస్తున్నాడంట. వీరిద్దరూ కలిసి ఈశ్వరన్ సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందంట. గత రెండేళ్ల నుంచి వీరిద్దరూ చెన్నైలోని ఒక ఇంట్లో కలిసే ఉంటున్నారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోనున్నదట. ప్రస్తుతం వీరిద్దరూ కెరీర్ పై ఫోకస్ పెట్టారని, త్వరలోనే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాలి. మరి ఆ క్లారిటీ ఎవరు ఇస్తారు అనేది చూడాలి.

Related Articles

Latest Articles