“ఎంజామీస్”తో ధనుష్ పార్టీ… పిక్ వైరల్

“ఎంజాయ్ ఎంజామి” సాంగ్ భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ తో ర్యాపర్ అండ్ సింగర్ అరివు, ఢీ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. తాజాగా వీరిద్దరితో కలిసి ధనుష్ దిగిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ధనుష్ ఈ పిక్ ను షేర్ చేసుకుంటూ “ఎంజామీస్ తో… ఒక బిలియన్ అండ్ హాఫ్ పిక్చర్‌!” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వీరంతా కలిసి పార్టీ చేసుకోవడానికి పాపులర్ మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా పుట్టినరోజు వేడుక వేదికైంది.

యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు, ఇళయరాజా చిన్న కుమారుడు. ఆయన కేవలం 16 సంవత్సరాల వయస్సులోనే సినీరంగ ప్రవేశం చేశాడు. 1996లో “అరవిందన్” అనే సినిమాకు సంగీతం అందించిన ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన సంగీతంతో కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఆయన మ్యూజిక్ తో మ్యాజిక్‌ చేశారు.

Read Also : దీపికా పదుకొనె హాలీవుడ్ రీఎంట్రీ… నాలుగేళ్ళ తరువాత…!

నిన్న యువన్ శంకర్ రాజా 42వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు యువన్ స్నేహితులు, సన్నిహిత కుటుంబ సభ్యులతో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఈ వేడుకలోనే ధనుష్ కూడా పాల్గొన్నాడు. ఆ సమయంలోనే అరివు, ఢీలతో కలిసి ఫోటో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ధనుష్ హిందీ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా “అట్రాంగి రే”లో నటిస్తున్నారు. దీనికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. ఇందులో సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ కూడా కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని టి-సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-