ఆ హీరోయిన్ తో స్టార్ హీరో తనయుడి ప్రేమాయణం..?

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు. ఆయనకు తెలుగులోనూ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక చియాన్ తనయుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు ధృవ్ విక్రమ్. టాలీవుడ్ లో సెగలు పుట్టించిన అర్జున్ రెడ్డి రీమేక్ ‘వర్మ’ చిత్రంతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన ధృవ్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అగ్రెస్సివ్ డాక్టర్ గా, ప్రేమ విఫలమైన ప్రేమికుడిగా ధృవ్ నటన ప్రేక్షకులను కదిలించింది. ఇక ఈ సినిమా తరువాత తండ్రి కొడుకులిద్దరూ కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ధృవ్ విక్రమ్ లవ్ స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది. వర్మ చిత్రంతో కోలీవుడ్ కి పరిచయమైన బనిత సంధుతో ధృవ్ ప్రేమాయణం నడుపుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. భారత సంతతికి చెందిన బ్రిటన్ బ్యూటీగా వర్మ సినిమా కోసం చెన్నై వచ్చిన ఈ చిన్నది ఈ షూటింగ్ లోనే ధృవ్ తో ప్రేమలో పడిపోయిందంట.

ధృవ్ కూడా అమ్మడి ప్రేమలో పీకల్లోతు మునిగిపోయాడని, ఇప్పటికి వీరిద్దరూ అప్పుడప్పుడు కలుస్తూ కెమెరా కంట చిక్కారని తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం మరో రెండు ఏళ్లలో ధృవ్ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడట. అయితే ఈ వార్తలపై విక్రమ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమా మాత్రమే చేసి, కెరీర్ ని చూసుకోకుండా ప్రేమ పెళ్లి ఇప్పుడు అవసరమా.. విక్రమ్ అయినా బుద్ధి చెప్పాలి కదా..? అని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఒక ఐదారు సినిమాలు తీసి ఒక స్టార్ గా నిలదొక్కుకున్నాకా ఇవన్నీ చేస్స్తే బావుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందొ తెలియాలంటే విక్రమ్, ధృవ్ విక్రమ్ ఎవరో ఒకరు ఓపెన్ అవ్వాలి అంటున్నారు తమిళ్ ఫ్యాన్స్.

Related Articles

Latest Articles