నెటిజన్లకు శింబు థ్యాంక్స్!

తమిళ యంగ్ స్టార్ హీరో శింబు నటించిన ‘ఈశ్వరన్’ ఈ యేడాది సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైంది. అనివార్య కారణాలతో తెలుగు వర్షన్ మాత్రం వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని మాతం సాధించలేదు. దాంతో శింబు కొత్త సినిమాల కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. శింబు ప్రస్తుతం ‘మానాడు’లో నటిస్తున్నాడు. ఈ యాక్షన్ ప్యాక్డ్ ప్రాజెక్ట్ పై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఇక చాలా కాలంగా విడుదల కాకుండా ఆగిన ‘మహా’ చిత్రంలో శింబు అతిథి పాత్రను పోషించాడు. అలానే ‘ముఫ్తీ’ రీమేక్ ‘పాతు తలా’లో నటిస్తున్నాడు. అలానే గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనూ శింబు ఓ చిత్రంలో నటించబోతున్నాడు. దానికి ‘నాదిగలిలే నీరదమ్ సూర్యన్’ అనే టైటిల్ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే… సోషల్ మీడియాలోకి కాస్తంత ఆలస్యంగా శింబు అడుగుపెట్టాడు. అయితే… ఇన్ స్టాగ్రామ్ లోకి ఈ యువ కథానాయకుడు ఇలా ఎంట్రీ ఇచ్చాడో లేదో… అలా అతన్ని అభిమానులు ఫాలో కావడం మొదలు పెట్టాడు. యేడాది కాకుండానే అంటే కేవలం 31 వారాల్లోనే శింబు ఫాలోవర్స్ సంఖ్య ఒక మిలియన్ కు చేరుకుంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ శింబు గత యేడాది చెన్నయ్ లో ఓ కాలేజీ ఈవెంట్ లో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ తన ఫస్ట్ మిలియన్ ఫాలోవర్స్ కూ థ్యాంక్స్ చెప్పాడు. మరి శింబు తన చిత్రాలకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను తరచూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తే… ఫాలోవర్స్ సంఖ్య రెండు మిలియన్స్ కు చేరడానికి అట్టే సమయం పట్టదు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-