రిపబ్లిక్: మా మనోభావాలు దెబ్బతిన్నాయ్

దేవాకట్టా దర్శకత్వంలో వచ్చిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబరు 1న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.. సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ జంట నటించగా.. సామాజిక దృక్కోణంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. ఇదిలావుంటే, రిపబ్లిక్ సినిమాపై ప.గో జిల్లా, కొల్లేరు గ్రామాల వాసూలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలో చెరువులను, చేపలను విషతుల్యం చేస్తున్నాం అని మా గ్రామాలపై దుష్ప్రచారం చేశారు. కొల్లేరు వాసుల మనోభావాలు దెబ్బతిసే విధoగా దర్శకుడు దేవా కట్టా చిత్రీకరణ చేసాడు. రిపబ్లిక్ సినిమాను నిలిపివేయాలని కొల్లేరు వాసూలు డిమాండ్ చేశారు. రిపబ్లిక్ సినిమా ఆపివేయలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, కలెక్టర్ కార్తికేయ మిశ్రాకి కొల్లేరు గ్రామాల వాసులు వినతి పత్రం అందజేశారు.

-Advertisement-రిపబ్లిక్: మా మనోభావాలు దెబ్బతిన్నాయ్

Related Articles

Latest Articles