ఐపీఎల్ 2021 : పంజాబ్ ను కట్టడి చేసిన కేకేఆర్ బౌలర్లు…

ఈరోజు మోడీ స్టేడియంలో కోల్‌కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు బ్యాట్స్మెన్స్ ను బాగానే కట్టడి చేసారు కేకేఆర్ బౌలర్లు. మొదట కెప్టెన్ రాహుల్ 19 పరుగులకే ఔట్ అయిన తర్వాత వచ్చిన గేల్ డక్ ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 31 పరుగులు చేసి వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ కువచ్చిన వారు ఒక్కరు కూడా కేకేఆర్ బౌలర్ల ముందు క్రీజులో నిలబడలేకపోయారు. కానీ చివర్లో క్రిస్ జోర్డాన్ 18 బంతుల్లో 30 పరుగులు చేయడంతో పంజాబ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఇక కోల్‌కత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ 3 వికెట్లు తీయగా సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్ రెండేసి వికెట్లు, శివం మావి, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలవాలంటే 124 పరుగులు చేయాలి. అయితే చూడాలి మరి నైట్ రైడర్స్ ఏం చేస్తారు అనేది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-