ఐపీఎల్ 2021 : కేకేఆర్ ముందు స్వల్ప లక్ష్యం…

ఐపీఎల్ 2021 లో ఈ రోజు రెండవ మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కెప్టెన్ విలియమ్సన్(26) నిలిచాడు. ఇక కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌతీ రెండు వికెట్లు, శివ మావి రెండు వికెట్లు, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీయగా షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో గెలవాలంటే కేకేఆర్ 116 పరుగులు చేస్తే చాలు. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశం ఉన్న కేకేఆర్ కు ఈ లక్ష్యం చిన్నదే అన్ని చెప్పాలి. చూడాలి మరి ఇక ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.

-Advertisement-ఐపీఎల్ 2021 : కేకేఆర్ ముందు స్వల్ప లక్ష్యం...

Related Articles

Latest Articles