కోకాపేట.. అత్యధికంగా రూ.60.2 కోట్లు.. అత్యల్పంగా రూ.31.2 కోట్లు

కోకాపేట భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది… హెచ్‌ఎండీఏ భూములు వేలం వేయగా… అధికారులు అంచనా వేసినకంటే ఎక్కువ ధరకు అమ్ముడు పోయాయి.. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ ద్వారా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) వేలం నిర్వహించింది.. ఒక్కో ఎకరం కనీస ధర రూ.25 కోట్లుగా నిర్ధారించగా.. వేలంలో రూ.60 కోట్లు పలకింది.. అత్యధికంగా ఎకరాకు రూ. 60.2 కోట్లు ధర పలకగా.. అత్యల్పంగా ఎకరానికి రూ. 31.2 కోట్లు వెచ్చించారు.. అవరెజిగా ఎకరానికి రూ. 40.05 కోట్లు పలికినట్టు అయ్యింది.. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా రూ.2000.37 కోట్ల ఆదాయం లభించింది.. దీంతో భూముల అమ్మకాల్లో కోకాపేట్‌ రికార్డు సృష్టించింది..

అత్యధికంగా ఎకరానికి రూ.60 కోట్లతో కొనుగోలు చేసింది రాజ పుష్ప రియాల్టీ… రూ.99 కోట్ల 33 లక్షలతో 1.65 ఎకరాల్ని కొనుగోలు చేశారు. ఇక, రూ.42.4 కోట్లతో మరో 7.7 ఎకరాలను సొంతం చేసుకుంది రాజ పుష్ప ప్రాపర్టీస్… రూ.42.2 కోట్లతో 7.7 రెండు ఎకరాలు సొంతం చేసుకున్నారు మన్నే సత్యనారాయణ రెడ్డి… అందరి కంటే తక్కువగా 31.2 కోట్లతో ఎకరాల స్థలాన్ని వేలంలో సొంతం చేసుకుంది హైమా డెవలపర్స్… మరోవైపు రూ.39.2 కోట్లకు ఎకరాల చొప్పున 8.9 ఎకరాలను సొంతం చేసుకుంది ఆక్వా స్పేస్ డెవలపర్స్…. రూ.39.2 కోట్ల ఎకరాల చొప్పున 7.5 ఎకరాలు సొంతం చేసుకున్నారు వర్సిటీ ఎడ్యుకేషన్… మొత్తం 49.9 ఎకరాల వేలం ద్వారా రెండు వేల కోట్లు సమకూర్చుకుంది ప్రభుత్వం.. ఎకరం రూ.25 కోట్లతో వేలం మొదలు కాగా.. సౌత్ ఇండియాలోనే ప్రభుత్వ భూముల్లో అత్యధిక కొత్త రికార్డు సృష్టించాయి..

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-